గౌడసంఘం భవనం ప్రారంభం
ABN , First Publish Date - 2022-08-04T06:00:22+05:30 IST
గౌడసంఘం భవనం ప్రారంభం
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 3: ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్‌లో గౌడ సంఘ భవనాన్ని బుదవారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్, జెడ్పీటీసీ భూపతిగల్ల మహిపాల్, సర్పంచ్ జి.బల్వంత్‌రెడ్డి, ఎంపీటీసీలు గంగిరెడ్డి జ్యోతి, అచ్చెన శ్రీశైలం, ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకటరమనారెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.