ఘనంగా గ్యార్మీ షరీఫ్ ఉత్సవం
ABN , First Publish Date - 2022-11-05T23:45:42+05:30 IST
: పట్టణంలో శనివారం గ్యార్మీ వేడుకలను స్థానిక ముస్లిం యువకుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఆమనగల్లు, నవంబరు 5: పట్టణంలో శనివారం గ్యార్మీ వేడుకలను స్థానిక ముస్లిం యువకుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా మౌలాలిపహాడ్ దర్గా సమీపంలోని గౌసే పాక్ చిల్లావద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలో గ్యార్మీ షరీఫ్ జెండాతో ప్రధాన వీదుల మీదుగా భారీర్యాలీ నిర్వహించారు. అనంతరం గౌసేపాక్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు, దువ్వా చేపట్టారు. అనంతరం మైనార్టీ యువ నాయకులు నయీం. ఇస్మాయిల్, జహంగీర్, అలీం, అజీం, ఆయూఫ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మౌలాన అబ్దుల్ కరీం, వాహేద్, అసీప్, సయ్యద్ ఖలీల్, ఎం.ఏ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.