-
-
Home » Telangana » Rangareddy » Funeral of Constable Rams with formalities-MRGS-Telangana
-
అధికార లాంఛనాలతో కానిస్టేబుల్ రాములు అంత్యక్రియలు
ABN , First Publish Date - 2022-03-06T05:13:48+05:30 IST
అధికార లాంఛనాలతో కానిస్టేబుల్ రాములు అంత్యక్రియలు

కులకచర్ల, మార్చి 5 : రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మండల పరిధిలోని ఇప్పయిపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ రాములు అంత్యక్రియలను పోలీసులు అధికార లాంఛనాలతో నిర్వహించారు. పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యేనరేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా యువజన నాయకుడు అనిల్‌కుమార్‌రెడ్డిలు రాములు మృతదేహానికి నివాళులర్పించారు. కాగా, అంత్యక్రియలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఎంపీపీ సత్యమ్మ, సర్పంచ్ అనురాధ, బాల్‌రెడ్డి, ఎంపీటీసీ పద్మ, కులకచర్ల, పరిగి ఎస్సైలు గిరి, విఠల్‌రెడ్డిలు అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. రాములు భార్య, కుటుంబసభ్యుల రోదనలు ప్రజలను కంటతడి పెట్టించాయి.