నేడు ఉచిత మెగా వైద్యశిబిరం

ABN , First Publish Date - 2022-10-07T05:49:23+05:30 IST

నేడు ఉచిత మెగా వైద్యశిబిరం

నేడు ఉచిత మెగా వైద్యశిబిరం
పరిగిలో విలేకరులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

పరిగి, అక్టోబరు 6: టీఆర్‌ఆర్‌ మెడికల్‌ కళాశాల, జనరల్‌ ఆస్పతి(పటాన్‌చెరువు) ఆధ్వర్యంలో శుక్రవారం పరిగి పట్టణంలో ఉచిత మెగా వైద్యశిబిరం, రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం పరిగిలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ట్రిమ్స్‌ మెడికల్‌ కాలేజీ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రిత్విక్‌రెడ్డి జన్మదినం సందర్భంగా వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా, అన్ని వివిధ ఆరోగ్య సమస్యలకు సంబంధించి స్పెషలిస్టు డాక్టర్లు వస్తున్నారని, ఏ రోగం ఉన్నవారైనా శిబిరానికి రావొచ్చన్నారు. రోగులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుందని టీఆర్‌ఆర్‌ తెలిపారు. రోగులకు అత్యవసర పరిస్థితి ఉన్నట్లయితే టీఆర్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీకి తీసుకెళ్లి ఉచితంగా వైద్యసేవలు అందజేస్తామని ఆయన తెలిపారు. పరిగి నియోజకవర్గ ప్రజలకు వైద్యపరంగా అన్ని రకాలుగా భరోసా కల్పిస్తానని తెలిపారు. ఈ అవకాశాన్ని పరిగి నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌(టీఆర్‌ఎస్‌) పార్టీ పరిగి, పూడూరు మండలాల అధ్యక్షులు బి.పరుశరాంరెడ్డి, సురేందర్‌, నాయకులు రామకృష్ణారెడ్డి, నీరటి శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-07T05:49:23+05:30 IST