300 మందికి ఉచిత మధుమేహ పరీక్షలు

ABN , First Publish Date - 2022-12-31T23:57:01+05:30 IST

మండల కేంద్రంలోని షిరిడీ సాయిబాబా మందిరం వద్ద శనివారం ఉచిత మధుమేహ నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు.

300 మందికి ఉచిత మధుమేహ పరీక్షలు

కడ్తాల్‌, డిసెంబరు 31: మండల కేంద్రంలోని షిరిడీ సాయిబాబా మందిరం వద్ద శనివారం ఉచిత మధుమేహ నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఆమనగల్లు లయన్స్‌క్లబ్‌, లియోక్లబ్‌, కడ్తాల సత్యసాయి భజన మండలి సంయుక్త ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేశారు. లయన్స్‌క్లబ్‌ జిల్లా మాజీ గవర్నర్‌ చెన్నకిషన్‌రెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. 300 మందికి మధుమేహ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో లియోక్లబ్‌ అధ్యక్షుడు క్యామ రాజేశ్‌, నాయకులు గంప శ్రీను, చేగూరి వెంకటేశ్‌, గురిగళ్ల లక్ష్మయ్య, పిప్పళ్ల వెంకటేశ్‌, కడారి రామకృష్ణ, దోనాదుల మహేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:57:01+05:30 IST

Read more