కుల వృత్తుల సంక్షేమానికి పెద్దపీట

ABN , First Publish Date - 2022-09-20T04:50:05+05:30 IST

కుల వృత్తుల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

కుల వృత్తుల సంక్షేమానికి పెద్దపీట
రావిరాల పెద్ద చెరువులో చేపపిల్లలను వదులుతున్న మంత్రి

  • రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, సెప్టెంబరు 19 : కుల వృత్తుల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని రావిరాల పెద్దచెరువులో సోమవారం మంత్రి చేపపిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో అధిక శాతం ప్రజలు కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ గుర్తించి, వారికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. చెరువుల్లో చేపపిల్లను వదిలి మత్య్సకార సంఘం సభ్యులకు చేయూతనందిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 88కోట్ల చేప పిల్లలను తమ ప్రభుత్వం చెరువుల్లో వదలనున్నట్లు తెలిపారు. అందులో రంగారెడ్డి జిల్లాలోని చెరువుల్లో 60లక్షల చేపపిల్లలను వదలాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ భవాని వెంకట్‌రెడ్డి, నాయకులు జె.లక్ష్మయ్య, బి.సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-09-20T04:50:05+05:30 IST