ట్రాఫిక్‌ నియమాలు పాటించాలి

ABN , First Publish Date - 2022-09-08T05:53:32+05:30 IST

ట్రాఫిక్‌ నియమాలు పాటించాలి

ట్రాఫిక్‌ నియమాలు పాటించాలి
చేవెళ్ల: మాట్లాడుతున్న సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాస్‌రావు

చేవెళ్ల/శంకర్‌పల్లి/మొయినాబాద్‌, సెప్టెంబరు 7: వాహనదారులు ట్రాఫిక్‌ నియమాలు పాటించాలని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివా్‌సరావు కోరారు. బుధవారం చేవెళ్ల పట్టణ కేంద్రంలో అంబేడ్కర్‌ చౌరస్తా, శంకర్‌పల్లి చౌరస్తాలో,  మొయినాబాద్‌ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను  స్థానిక ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్‌ ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీనివా్‌సనాయుడు, చేవెళ్ల ఏసీపీ రవీందర్‌రెడ్డి, చేవెళ్ల ట్రాఫిక్‌ సీఐ గురువయ్యగౌడ్‌, చేవెళ్ల, శంకర్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు, మహేశ్‌గౌడ్‌, ఎస్‌ఐలు కృష్ణ, విఠల్‌రెడ్డి, ఏఎ్‌సఐ చందర్‌నాయక్‌ ఉన్నారు. 

Read more