13 నుంచి ఫ్లైబిగ్‌ విమాన సర్వీసులు

ABN , First Publish Date - 2022-03-04T05:46:30+05:30 IST

13 నుంచి ఫ్లైబిగ్‌ విమాన సర్వీసులు

13 నుంచి ఫ్లైబిగ్‌ విమాన సర్వీసులు
ఎయిర్‌ పోర్టు నుంచి ప్రారంభించే ఫ్లైబిగ్‌ విమానం

శంషాబాద్‌ రూరల్‌, మార్చి 3: ఈ నెల 13నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఫ్లైబిగ్‌ ఎయిర్‌లైన్స్‌ విమాన సర్వీసులు ప్రారంభిస్తామని ఎయిర్‌లైన్స్‌ అధికారులు గురువారం పేర్కొన్నారు. దేశంలోని మూడు నగరాలు ఇండోర్‌, మహారాష్ట్రలోని గోండియా, హైదరాబాద్‌లకు ఫ్లైబిగ్‌ సేవలు విస్తరిస్తున్నట్లు తెలిపారు. గురువారం నుంచి బుకింగ్‌ ప్రారంభించామన్నారు. గతంలో 8నగరాలకు ఉన్న సేవలు ఇప్పుడు 11కు చేరిందని ఎయిర్‌లైన్స్‌ అధికారులు వెల్లడించారు. ఫ్లైబిగ్‌ సీఎండీ కెప్టన్‌ సంజయ్‌ మాండవి యా మాట్లాడుతూ.. సామర్థ్యాన్ని వేగంగా విస్తరించడానికి, బల మైన పాన్‌-నేషనల్‌ ప్రాంతీయ కమ్యూటర్‌ నెట్‌వర్క్‌ నిర్మా ణా నికి ఫ్లైబిగ్‌ కృషి చేస్తోందన్నారు. దేశంలో ఇప్పటి వరకు ఉపయోగించని మార్గాల్లో సేవలను ప్రారంభిస్తున్నామన్నారు.

Read more