జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన విద్యార్థినికి ఆర్థికసాయం
ABN , First Publish Date - 2022-12-16T23:44:51+05:30 IST
జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన రాధికకు ఎఫ్‌ఎ్‌ససీఎస్ డైరెక్టర్ నారాయణరెడ్డి రూ.2వేల ఆర్థికసాయం అందజేశారు.
పెద్దేముల్, డిసెంబరు 16: జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన రాధికకు ఎఫ్‌ఎ్‌ససీఎస్ డైరెక్టర్ నారాయణరెడ్డి రూ.2వేల ఆర్థికసాయం అందజేశారు. మంబాపూర్ జెడ్పీ పాఠశాల విద్యార్థిని రాధిక ఇటీవల జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైంది. జనవరిలో బీహార్‌లో నిర్వహించే పోటీల్లో పాల్గొననుంది. ఆమెకు రవాణాచార్జీల నిమిత్తం ఉపయోగపడతాయనే తాను విద్యార్థినికి ఆర్థిక సహాయం అందజేశానని నారాయణరెడ్డి చెప్పారు.