కానిస్టేబుల్‌ కుటుంబానికి ఆర్థిక సాయం

ABN , First Publish Date - 2022-12-16T23:35:44+05:30 IST

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కానిస్టేబుల్‌ షరీఫ్‌ కుటుంబానికి నాయకులు, తోటి సిబ్బంది ఆర్థికసాయం అందజేశారు.

కానిస్టేబుల్‌ కుటుంబానికి ఆర్థిక సాయం
ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌కుమార్‌కు నగదు అందజేస్తున్న అల్వాల్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజు

శామీర్‌పేట, డిసెంబరు 16: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కానిస్టేబుల్‌ షరీఫ్‌ కుటుంబానికి నాయకులు, తోటి సిబ్బంది ఆర్థికసాయం అందజేశారు. శుక్రవారం మూడుచింతలపల్లి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు బొమ్మలపల్లి నర్సింలుయాదవ్‌, ఉద్దెమర్రి యాదవసంఘం అధ్యక్షుడు సంజీవ్‌ రూ.10వేల చొప్పున ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌కుమార్‌కు అందజేశారు. అలాగే అల్వాల్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజు ఆధ్వర్యంలో సిబ్బంది రూ.50వేలు అందజేశారు. ఎస్సైలు శ్రీనివాస్‌, రవికుమార్‌, మునీందర్‌, చంద్రశేఖర్‌, రఘు, విద్యాకర్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:35:45+05:30 IST