రూ.50వేల ఆర్థిక సాయం అందజేత
ABN , First Publish Date - 2022-12-07T23:59:15+05:30 IST
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆమనగల్లు ఫొటోగ్రాఫర్ శవ్వ మల్లేశ్ కుటుంబానికి జిల్లా, మండల ఫొటోగ్రాఫర్స్ సోసియేషన్ చేయూతనందించింది.
ఆమనగల్లు, డిసెంబరు 7: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆమనగల్లు ఫొటోగ్రాఫర్ శవ్వ మల్లేశ్ కుటుంబానికి జిల్లా, మండల ఫొటోగ్రాఫర్స్ సోసియేషన్ చేయూతనందించింది. ఆ కుటుంబానికి తామున్నామని అసోసియేషన్ నాయకులు భరోసా ఇచ్చారు. రాష్ట్ర కమిటీ నుంచి రూ.10వేలు, మండలాల నుంచి రూ.40వేలు పోగుచేసి బుధవారం మల్లేశ్ భార్య మమతకు రూ.50వేల చెక్కును రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శేఖర్, కోశాధికారి శివలింగంగౌడ్, ఆమనగల్లు అధ్యక్షుడు కాడిగె సత్యం అందజేశారు. అసోసియేషన్ నాయకులు దుడ్డు శ్రీశైలం, ప్రశాంత్‌రెడ్డి, గణేశ్, వెంకటేశ్, గిరి, అలీం, శ్రీకాంత్, తిరుపతయ్య, నాగరాజు, ప్రవీణ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.