సర్వీసు రోడ్డుపై గుంతల పూడ్చివేత

ABN , First Publish Date - 2022-12-16T23:17:52+05:30 IST

అవుషాపూర్‌ వద్ద జాతీయ రహదారి సర్వీసు రోడ్డు అండర్‌పా్‌సలో ఏర్పడిన గుంతలను శుక్రవారం ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు బీటీ వేయించి పూడ్పించారు.

సర్వీసు రోడ్డుపై గుంతల పూడ్చివేత
అవుషాపూర్‌ వద్ద సర్వీసు రోడ్డును పరిశీలిస్తున్న అధికారులు

ఘట్‌కేసర్‌ రూరల్‌, డిసెంబరు 16: అవుషాపూర్‌ వద్ద జాతీయ రహదారి సర్వీసు రోడ్డు అండర్‌పా్‌సలో ఏర్పడిన గుంతలను శుక్రవారం ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు బీటీ వేయించి పూడ్పించారు. ఈ నెల 14న ఆంధ్రజ్యోతిలో ‘సర్వీసు రోడ్డు నరకప్రాయం‘ అనే శీర్షికన ప్రచురితమైన వార్తకు అఽధికారులు స్పందించారు. కాగా ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, నాయకులు మల్లేష్‌, మశ్చేందర్‌రెడ్డి అక్కడికి చేరుకొని సర్వీసు రోడ్డు మరమతులు త్వరగా చేయాలని అధికారులను కోరారు. రోడ్డుకు ఇరువైపుల లైటింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఏఐ డీజీఎం తేజోనిధి, తదితరలుఉ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:17:53+05:30 IST