పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : చంద్రశేఖర్
ABN , First Publish Date - 2022-08-04T05:57:59+05:30 IST
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : చంద్రశేఖర్
మర్పల్లి, ఆగస్టు 3 : పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీమంత్రి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం మండలంలోని దామస్తాపూర్, షాపూర్, కల్కోడా గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలను, బ్రిడ్జీని ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం మర్పల్లి పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు, అధికారులు చేస్తున్న పనులపై బీజేపీ యువకులు ప్రశ్నిస్తుంటే.. వారిపై అధికార బలంతో తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా దాడులకు పాల్పడుతున్నారని తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టినా, వారిపై దాడులు చేసినా ఇకపై సహించేదిలేదని చంద్రశేఖర్ తెలిపారు. పంటలు నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిహారం ఇప్పించేలా కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మండలాధ్యక్షుడు మల్లేశ్‌యాదవ్, నాయకులు రమేశ్‌రెడ్డి, శ్రీనివాస్, ప్రవీణ్‌గౌడ్, మధు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.