రైతులు ఈకేవైసీ చేయించుకోవాలి : ఏడీఏ

ABN , First Publish Date - 2022-12-15T23:54:40+05:30 IST

పీఎం కిసాన్‌ డబ్బుల జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ కొడంగల్‌ ఏడీఏ శంకర్‌రాథోడ్‌ తెలిపారు.

రైతులు ఈకేవైసీ చేయించుకోవాలి : ఏడీఏ

కొడంగల్‌ రూరల్‌, డిసెంబరు 15: పీఎం కిసాన్‌ డబ్బుల జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ కొడంగల్‌ ఏడీఏ శంకర్‌రాథోడ్‌ తెలిపారు. గురువారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులు పీఎం కిసాన్‌ డబ్బుల కోసం తమ ఫోన్‌నెంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయించుకోవాలని అన్నారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో సీఎ్‌ససీ కేంద్రం ఆధ్వర్యంలో ఈకేవైసీ నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి దేవేందర్‌, అంగన్‌వాడీ కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:54:41+05:30 IST