భూ సర్వేను అడ్డుకున్న రైతులు

ABN , First Publish Date - 2022-03-06T04:13:59+05:30 IST

భూ సర్వేను అడ్డుకున్న రైతులు

భూ సర్వేను అడ్డుకున్న రైతులు
సర్వే చేయకుండా అడ్డుకుంటున్న రైతులు

మోమిన్‌పేట, మార్చి5: మా భూములు లాక్కోవద్దంటూ ఎన్కతల గ్రామానికి చెందిన కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మోమిన్‌పేట మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో రెవెన్యూ అధికారులు శనివారం భూ సర్వే నిర్వహించేందుకు రాగా రైతులు వారిని అడ్డుకున్నారు. తమకు ఎలాంటి పట్టా భూములు లేవని, ప్రభుత్వ భూమినే పట్టా భూమిగా సాగు చేసుకుంటూ బోర్లు, బావులు తవ్వుకుని పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నామన్నారు. ఈ పొలాలే తమకు జీవనాధారం అని  అధికారుల ఎదుట వాపోయారు. దీంతో తహసీల్దార్‌ శ్రీనివా్‌సరెడ్డి స్పందిస్తూ మీభూములు ఎవరూ తీసుకోరని, ఎవరికి ఎంత భూమి ఉందో, ఎంత కబ్జాలో ఉంది అనే విషయాలు సర్వే చేస్తున్నామని చెప్పారు. అయినా రైతులు వినకపోవడంతో ఈవిషయాన్ని కలెక్టర్‌, ఆర్డీవో దృష్టికి తీసుకెళ్తామని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ రాజు, అరుణ్‌కుమార్‌,  తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-03-06T04:13:59+05:30 IST