విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN , First Publish Date - 2022-08-04T05:48:21+05:30 IST

విద్యుదాఘాతంతో రైతు మృతి

విద్యుదాఘాతంతో రైతు మృతి
సురేశ్‌ మృతదేహం

కడ్తాల్‌, ఆగస్టు 3: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందిన సంఘటన మ క్తమాదారంలో బుధవారం సాయత్రం ఈ చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల మేరకు .. మక్తమాదారానికి చెందిన పచ్చిపాల సురేశ్‌(30) తన పొలంలో బోరు మోటార్‌ వైర్లు సరిచేస్తుండగా కరెంట్‌ షాక్‌ కొట్టింది. దీంతో అతడు అక్క డికక్కడే మృతిచెందాడు. సురేశ్‌కు భార్య సంధ్య, నలుగురు పిల్లలు ఉన్నారు. సంఘటనా స్థలానికి ఎస్సై హరిశంకర్‌గౌడ్‌ చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. రైతు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. రైతు మృతిపట్ల ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ సంతాపం తెలిపారు. విద్యుత్‌ శాఖ, ప్రభుత్వ పరంగా సాయమందేలా చూస్తానన్నారు. సంఘటనా స్థలాన్ని మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు యాట నర్సింహ, సర్పంచ్‌ సులోచన సాయిలు, ఎంపీటీసీ మంజుల సందర్శించి నివాళి అర్పించారు.

Updated Date - 2022-08-04T05:48:21+05:30 IST