ఏటీఎంలో చోరీకి విఫలయత్నం

ABN , First Publish Date - 2022-08-04T05:42:00+05:30 IST

ఏటీఎంలో చోరీకి విఫలయత్నం

ఏటీఎంలో చోరీకి విఫలయత్నం

మేడ్చల్‌, ఆగస్టు 3 : మేడ్చల్‌ పట్టణంలో గల ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. బుధవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఓమ్నీ వాహనంలో వచ్చి ఏటీఎంలో చోరీకి యత్నించారు. సీసీ టీవీ ఫుటేజీ సాయంతో పసిగట్టిన పోలీసులు అప్రమత్తమై ఏటీఎం వద్దకు చేరుకోగా దొంగలు పారిపోయారు. కాగా, ముగ్గురు పారిపోగా ఒకరు పోలీసు అదుపులో ఉన్నారు. సీఐ రాజశేఖర్‌రెడ్డి ఏటీఎంను పరిశీలించారు.

 

Updated Date - 2022-08-04T05:42:00+05:30 IST