ప్రతిఒక్కరూ భక్తిభావం కలిగి ఉండాలి
ABN , First Publish Date - 2022-06-25T05:28:26+05:30 IST
ప్రతిఒక్కరూ భక్తిభావం కలిగి ఉండాలి

కులకచర్ల, జూన్ 24 : ప్రతిఒక్కరూ భక్తిభావం కలిగి ఉండాలని, గ్రామ దేవతల విగ్రహాలు ప్రతిష్ఠించడం అభినందనీయమని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి తెలిపారు. కులకచర్ల మండలం పీరంపల్లి గ్రామంలో శుక్రవారం బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బొడ్రాయి ప్రతిష్ఠాపనతో గ్రామానికి మంచి జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎంపీపీ సత్యాహరిశ్చంద్ర, దోమ జడ్పీటీసీ నాగిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ హరికృష్ణ, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ బాలరాజు, సొసైటీ వైస్‌చైర్మన్ నాగరాజు, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు శేరి రాంరెడ్డి, సర్పంచ్ రాధికా సోమలింగం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- ఆలయాల అభివృద్ధికి దాతలు సహకరించాలి
ఘట్కేసర్ రూరల్, జూన్ 24 : గ్రామదేవతల ఆలయాల అభివృద్ధికి దాతలు సహకరించాలని ఎదులాబాద్ ఇన్చార్జి సర్పంచ్ ఉప్పు లింగేశ్వర్‌రావు అన్నారు. ఎదులాబాద్ అనుబంధ గ్రామం పోతరాజిగూడలోని పోచమ్మ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణానికి సహకరించిన దత కొండల విద్యాసాగర్‌రెడ్డి దంపతులను శాలువాలతో సత్కరించారు. ఎంపీటీసీ గట్టగల్ల రవి, కార్యదర్శి ఉష, వార్డుసభ్యులు ఆంజనేయులు, నాయకులు జవ్వాజీ సత్తయ్య, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
- అన్నోజిగూడలో ఘనంగా బొడ్రాయి పునఃప్రతిష్ఠ పూజలు
ఘట్కేసర్, జూన్ 24 : పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడలో బొడ్రాయి పునఃప్రతిష్ఠ పూజలు కనులవండువగా నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేకపూజలు చేశారు. ఈసందర్భంగా శివసత్తుల నృత్యాలతో రెవెన్యూ సరిహద్దుల వరకు ఉరేగింపుగావెళ్లి బలి చల్లారు. ఎంతోకాలంగా చేయాలనుకున్న పని ఎట్టకేలకు పూర్తయ్యిందని మున్సిపల్ చైర్మన్ కొండల్‌రెడ్డి, వైస్‌చైర్మన్ నానావత్ రెడ్డియానాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా కాలనీల నాయకులు, స్థానికులు భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
- ఆలయ అభివృద్ధికి ముందుకు రావాలి
కీసర, జూన్ 24 : ప్రసిద్ధ శైవ క్షేత్రమైన కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయ అబివృద్ధికి దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆలయ చైర్మన్ తటాకం ఉమాపతిశర్మ అన్నారు. ఈమేరకు దాత సహకారంతో నిర్మిస్తున్న శ్రీ శివదుర్గ అమ్మవార్ల ఆలయ పున:నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయ చైర్మన్ ఉమాపతి శర్మ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, శాస్ర్తోక్తంగా ఆలయ నిర్మాణాల పనులు చేపడుతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో సుధాకర్‌రెడ్డి, ట్రస్ట్ బోర్డు సభ్యులు రాయిల శ్రవణ్‌గుప్తా, బొడుసు రమే్‌షగుప్తా, సాయినాథ్‌గౌడ్, భాగ్యలక్ష్మి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
- వైభవంగా సీతారామలక్ష్మణ, ఆంజనేయస్వామి ఆలయ ధ్వజశిఖర ప్రతిష్ఠాపనోత్సవాలు
మేడ్చల్, జూన్ 24 : మేడ్చల్ మండలం రాజబొల్లారం గ్రామంలో శ్రీ సీతారామలక్ష్మణ, ఆంజనేయస్వామి ఆలయ ధ్వజశిఖర ప్రతిష్ఠాపనోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. నాలుగు రోజులపాటు నిర్వహించనున్న ఉత్సవాలకు శుక్రవారం గణపతి పూజతో అంకురార్పణ చేశారు. శిఖర ప్రతిష్ఠలో భాగంగా వేదపండితులు ఆవాహిత దేవతా పూజ, వేద పారాయణం, గరుడ సాంస్కరం, మంత్రమూర్తి ప్రతిష్ఠ, పూర్ణాహుతి, కుంకుమార్చన, తదితర పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. కాగా, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.