ప్రతీఒక్కరు దైవచింతన కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2022-12-31T23:50:33+05:30 IST

ప్రతిఒక్కరూ దైవ చింతనను కలిగి ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు.

ప్రతీఒక్కరు దైవచింతన కలిగి ఉండాలి
కందుకూరు: ధన్నారంలో మహాపడి పూజలో పాల్గొన్న మంత్రి సబితాఇంద్రారెడ్డి

కందుకూరు/షాబాద్‌/కొత్తూర్‌, డిసెంబరు 31: ప్రతిఒక్కరూ దైవ చింతనను కలిగి ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మండలంలోని కందుకూరు, ధన్నారం గ్రామాల్లో నిర్వహించిన ఇరుముడి మహాపడిపూజలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మహేశ్వరం మార్కెట్‌ కమిటీ, చైర్మన్‌ ఎస్‌.సురేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, టీపీసీసీ మెంబర్‌ ఏనుగు జంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, శ్రీరాములు యాదవ్‌, డి.చంద్రశేఖర్‌, రాజశేఖర్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా షాబాద్‌ మండలం హైతాబాద్‌లో గల అయ్యప్ప ఆలయంలో కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ నాయకుడు మహమ్మద్‌ బురాన్‌ అయ్యప్ప స్వాములకు బిక్ష ఏర్పాటు చేసి మత సామరస్యాన్ని చాటుకున్నాడు. ఈ కార్యక్రమంలో గురుస్వామి గోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కావలి చంద్రశేఖర్‌, నాయకులు శేఖర్‌, సతీ్‌షచారి, అశోక్‌గౌడ్‌, సత్యంయాదవ్‌, శేఖర్‌ పాల్గొన్నారు. అదేవిధంగా కొత్తూర్‌ మండలంలోని శ్రీఆంజనేయస్వామి ఆలయంలో అయ్యప్పసేవా సమితీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా శనివారం టీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీనివా్‌సరెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్పలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మాదారం నర్సింహాగౌడ్‌, సోమ్లానాయక్‌, స్వాములు పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక భావనతోనే మానసిక ప్రశాంతత

ఇబ్రహీంపట్నం: ఆధ్యాత్మిక భావనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. స్థానిక శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం జరిగిన అయ్యప్ప మహాపడిపూజలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, మాజీ పట్వారి జైన్‌ శ్రీరాంరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆకుల యాదగిరి పాల్గొన్నారు

కష్టపడే నేతలకు సముచిత స్థానం కల్పిస్తాం

మంచాల: పార్టీలో కష్టపడే నేతలకు సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డికిషన్‌రెడ్డి అన్నారు. లోయపల్లికి చెందిన వివిధ పార్టీల నేతలు బీఆర్‌ఎస్‌ పథకాలకు ఆకర్శితులై ఎమ్మెల్యే సమక్షంలో శనివారం బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎ్‌సలో చేరిన వారిలో బజారు శ్రీశైలం, మల్లేష్‌, యాదయ్య, మాదగోనిరాజు, ఉడుగు యాదయ్య, మల్లేష్‌, పొలగోని శ్రీను ఉన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్‌, బహదూర్‌, నర్మదలచ్చిరాం, పుల్లారెడ్డి, బద్రీనాథ్‌గుప్త, నారియాదయ్య, ప్రవీణ్‌, జానయ్య, రమేష్‌, వెంకటే్‌షగౌడ్‌, జంగయ్య, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:50:34+05:30 IST