రేపు తాండూరులో వ్యాసరచన పోటీలు

ABN , First Publish Date - 2022-08-15T05:49:34+05:30 IST

రేపు తాండూరులో వ్యాసరచన పోటీలు

రేపు తాండూరులో వ్యాసరచన  పోటీలు

తాండూరు, ఆగస్టు 14 : తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా రేపు(మంగళవారం) వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు తాండూరు చైతన్య జూనియర్‌ కళాశాలలో భారత చైతన్య ఉద్యమంలో భాగంగా పోరాడిన ‘స్వాతంత్య్ర ఉద్యమ నాయకుల పాత్ర’పై వ్యాసరచన పోటీని నిర్వహిస్తున్నట్లు విద్యార్థి విభాగం నాయకులు జిలాని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ కళాశాల నుంచి ఆరుగురు విద్యార్థులను పోటీలకు పంపాలని కోరారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ప్రముఖులచే బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. ఇతర వివరాలకు సెల్‌ : 9581696564 నెంబర్‌ను సంప్రదించాలని ఈ సందర్భంగా కోరారు.

Read more