సంక్షేమ పథకాల ప్రభావంతోనే బీఆర్‌ఎ్‌సలో చేరికలు

ABN , First Publish Date - 2022-12-16T23:22:26+05:30 IST

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌ కార్యకర్తలు బీఆర్‌ఎ్‌సలో చేరారని పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి అన్నారు.

సంక్షేమ పథకాల ప్రభావంతోనే బీఆర్‌ఎ్‌సలో చేరికలు
ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరుతున్న కిష్టాపూర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు

దోమ/పరిగి, డిసెంబరు 16: ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌ కార్యకర్తలు బీఆర్‌ఎ్‌సలో చేరారని పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి అన్నారు. పరిగిలో ఎమ్మెల్యే నివాసంలో దోమ మండలం కిష్టాపూర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు జడ్పీటీసీ నాగిరె డ్డి ఆధ్వర్యంలో శుక్రవారం బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యం కావాలని వారితో మహేశ్‌రెడ్డి అన్నారు. వైస్‌ఎంపీపీ మల్లేశం, సర్పంచ్‌ సత్యమ్మ, మాజీ ఎంపీపీ వెంకటయ్య, నర్సిములు, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:22:27+05:30 IST