‘తొలిమెట్టు’తో సామర్థ్యాల మెరుగు

ABN , First Publish Date - 2022-08-04T05:48:54+05:30 IST

‘తొలిమెట్టు’తో సామర్థ్యాల మెరుగు

‘తొలిమెట్టు’తో సామర్థ్యాల మెరుగు
శిక్షణనిస్తున్న హెచ్‌ఎం

కొందుర్గు/మాడ్గుల, ఆగస్టు 3: తొలిమెట్టుతో విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరుగుతాయని తొలిమెట్టు కోర్సు డైరెక్టర్‌, కొందుర్గు ఉన్నత పాఠశాల హెచ్‌ఎం శ్రీదేవి అన్నారు. బుధవారం ఉన్నత పాఠశాలలో తొలిమెట్టు(ఎ్‌ఫఎల్‌ఎన్‌)లో భాగంగా ఉపాధ్యాయులకు శిక్షణను ప్రారంభించారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తెలుగు, గణితం, సైన్స్‌ సబ్జెక్టుల్లో సామర్థ్యాలు పెంపొందించేలా బోధించేలా శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. ఆర్పీలు లక్ష్మీదేవి, రమేష్‌, రాంచందర్‌, కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మంచి భోజనం అందించాలని మాడ్గుల ఎంపీపీ జి.పద్మ అన్నారు. మాడ్గుల ఉన్నత పాఠశాలలో తొలిమెట్టు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ప్రత్యేకాధికారి రేఖ, ఎంపీడీవో ఫారూక్‌ హుస్సేన్‌, హెచ్‌ఎం విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-08-04T05:48:54+05:30 IST