ఉరేసుకొని ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-09-10T05:30:00+05:30 IST

ఉరేసుకొని ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

ఉరేసుకొని ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

ఘట్‌కేసర్‌ రూరల్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : అనుమానాస్పదస్థితిలో ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సీఐ చంద్రబాబు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆదిలాబాద్‌ జిల్లా బైంసా పట్టణానికి చెందిన పబ్బ ధర్మపురి కుమార్తె శాలిని(21) మండల పరిధిలో గల చౌదరిగూడలోని హుడా కార్తికేయ ఎన్‌క్లేవ్‌3-డీ/109లో అద్దెకుంటూ వెంకటాపూర్‌లోని అనురాగ్‌ యూనివర్సిటీలో సివిల్‌ ఇంజనీరింగ్‌ 4వ సంవత్సరం చదువుతోంది. కాగా, శుక్రవారం రాత్రి 11:45లకు శాలిని అద్దెకుంటున్న గదిలో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో చుట్టుపక్కల వారు గమనించి డయల్‌-100 నెంబర్‌కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గదిలో పరిసరాలను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. శాలిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, అనుమానాస్పదస్థితిలో ఆత్మహత్యగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


Read more