ఆలయ కమిటీ అధ్యక్షుడిగా ఏనుగు జంగారెడ్డి

ABN , First Publish Date - 2022-03-05T05:30:00+05:30 IST

ఆలయ కమిటీ అధ్యక్షుడిగా ఏనుగు జంగారెడ్డి

ఆలయ కమిటీ అధ్యక్షుడిగా ఏనుగు జంగారెడ్డి
దెబ్బడగూడ శివరామాంజనేయ స్వామి ఆలయ నూతన కమిటీతో ఏనుగు జంగారెడ్డి

కందుకూరు, మార్చి 5: మండలంలోని దెబ్బడగూడ గ్రామంలోని శివ రామాంజనేయ స్వామి దేవాలయ నూతన కమిటీ చైర్మన్‌గా ఏనుగు జంగారెడ్డిని ఎన్నుకున్నారు. శనివారం ఉదయం ఆలయంలో జరిగిన ప్రత్యేక సమావేశం అనంతరం నూతన కమిటిని జంగారెడ్డి ప్రకటించారు. ప్రధానకార్యదర్శిగా కొలన్‌ విఘ్నేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా డి.ఆంజనేయులు, కుమ్మరి సాంబయ్య, కార్యదర్శులుగా నీలం వెంకటేష్‌, బండ రామస్వామి, రమావత్‌ జైపాల్‌నాయక్‌, కోశాధికారిగా అమరవాద మనోహర్‌గుప్త, ఉత్సవ కమిటీ సభ్యులుగా సురసాని భూమిరెడ్డి, కళ్లెం చెన్నారెడ్డి, డి.సురేష్‌, ఎస్‌.దయాకర్‌రెడ్డి, కె.పరేష్‌, కె.రవికాంత్‌రెడ్డి, సల హాదారులుగా కె.సుధాకర్‌రెడ్డి, టి.జగదీశ్వర్‌రెడ్డి, జిట్ట.రవీందర్‌రెడ్డి, ఏ.శ్రీనివాస్‌, కె.జంగారెడ్డి, ఎల్మటి జగదీశ్‌రెడ్డి, ఉల్మటి శేఖర్‌రెడ్డి, ఆర్‌.చందు, మల్లేపల్లి జంగయ్య, ముఖ్య సలహాదారులుగా  జిట్ట రాజేందర్‌రెడ్డి, ఎల్మటి దేవేందర్‌రెడ్డిలను ఎన్నుకున్నట్లు జంగారెడ్డి ప్రకటించారు. 

Read more