ఖానాపూర్‌-లాతూర్‌ రోడ్ల మధ్య 98.7 కి.మీ విద్యుద్దీకరణ పూర్తి

ABN , First Publish Date - 2022-10-07T05:47:41+05:30 IST

ఖానాపూర్‌-లాతూర్‌ రోడ్ల మధ్య 98.7 కి.మీ విద్యుద్దీకరణ పూర్తి

ఖానాపూర్‌-లాతూర్‌ రోడ్ల మధ్య 98.7 కి.మీ విద్యుద్దీకరణ పూర్తి

హైదరాబాద్‌, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): వికారాబాద్‌-పర్లీనాధ్‌ ప్రాజెక్టులో భాగంగా ఖానాపూర్‌-లాతూర్‌ రోడ్‌ సెక్షన్‌ల మధ్య 98.7 రూట్‌ కి.మీ విద్యుద్దీకరణ పనులు పూర్తిచేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. కర్నాటక, మహారాష్ట్రాలను కలుపుతూ 2018-19 లో రూ. 262 కోట్ల అంచనా వ్యయంతో  వికారాబాద్‌-లాతూర్‌ రోడ్‌ మధ్య  విద్యుద్దీకరణ పనులు చేపట్టి పూర్తి చేసినట్టు అధికారులు వివరించారు. వికారాబాద్‌-కోహీర్‌ దక్కన్‌ సుమారు 45 కిమీ పనులు 2021 మార్చిలో ప్రారంభించినట్టు వివరించారు. కోహిర్‌దక్కన్‌-ఖానాపూర్‌  60.4 కిమీ 2021 జనవరిలో పనులు చేపట్టినట్టు తెలిపారు. కాగా పూర్తి అయిన ప్రస్తుత 98.7 కిమీ విద్యుద్దీకరణ ఒకే మార్గంలో 46.8 కిమీ మహారాష్ట్రలో ఉండా 51.9 కిమీ కర్నాటకలో ఉన్నట్టు అధికారులు వివరించారు. దీంతో లాతూర్‌రోడ్‌ బీదర్‌ నుంచి దక్షిణ దిశగా బయలుదేరు రైళ్లు ఇక నుంచి ఎలక్ర్టిక్‌ ట్రాక్షన్‌తో కొనసాగుతాయన్నారు. విద్యుద్దీకరణ పనులు యుద్ద పూర్తి చేయడానికి కృషిచేసిన అధికారులు, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే  జనరల్‌ మేనేజర్‌  అరుణ్‌కుమార్‌ జైన్‌ అభినందించారు. 


Updated Date - 2022-10-07T05:47:41+05:30 IST