బీజేవైఎం నూతన అధ్యక్షుల ఎన్నిక
ABN , First Publish Date - 2022-10-08T05:01:19+05:30 IST
మండలంలోని కొత్తకుంట తండా, పోలెపల్లి బీజేవైఎం బూత్ కమిటీ
ఆమనగల్లు, అక్టోబరు 7: మండలంలోని కొత్తకుంట తండా, పోలెపల్లి బీజేవైఎం బూత్ కమిటీ ఎన్నికలు శుక్రవారం బీజేపీ నాయకులు గండికోట శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఎన్నిక కార్యక్రమానికి బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి వగ్గు ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక నాయకులు సమావేశమై కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్తకుంట తండా అధ్యక్షుడిగా అల్లె నరేశ్ యాదవ్, పోలెపల్లి అధ్యక్షుడిగా ఓర్సు శ్రీకాంత్‌లు ఎన్నికయ్యారు. అనంతరం ప్రభాకర్ నూతన అధ్యక్షులకు ఎన్నిక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారిని సత్కరించి అభినందించారు.