రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2022-04-25T05:05:56+05:30 IST

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 24 : రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఆటో ఢీ కొట్టడంతో తీవ్రగాయాలై మృతిచెందిన సంఘటన ఘట్‌కేసర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఘట్‌కేసర్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఎదులాబాద్‌ గ్రామ సమీపంలోని పోతరాజుగూడెం బస్టాప్‌ వద్ద అదే గ్రామానికి చెందిన సామలేటి యాదయ్య(65) నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా ఎదులాబాద్‌ నుంచి పిలాయిపల్లికి వెళ్లుతున్న ఆటో ఢీ కొట్టింది. దీంతో యాదయ్యకు తీవ్రగాయాలు కాగా, స్థానికులు చికిత్స నిమిత్సం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆటోడ్రైవర్‌ అజాగ్రత్త, అతివేగంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. యాదయ్య బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more