ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
ABN , First Publish Date - 2022-12-16T00:06:13+05:30 IST
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్ధన్‌రెడ్డి అన్నారు.
ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్ధన్‌రెడ్డి
కీసర రూరల్, డిసెంబరు 15 : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం నాగారం మున్సిపల్ పరిధిలోని జీఆర్‌ఎ్‌సఎస్ ఫంక్షన్‌హాల్‌లో పీఆర్టీయూ(తెలంగాణ) జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు రప్పించేందుకు కృషి చేస్తానని, భార్యాభర్తల బదిలీల విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపునకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. కాగా, మేడ్చల్ జిల్లా పీఆర్టీయూటీఎస్ గౌరవ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి.శ్రీధర్, మల్కాజ్‌గిరి, అల్వాల్, మూడుచింతలపల్లి, బాచుపల్లి, కాప్రా మండలాల అధ్యక్ష, కార్యదర్శులు ఆ సంఘానికి మూకుమ్మడిగా రాజీనామా చేసి, ఎమ్మెల్సీ సమక్షంలో పీఆర్టీయూ తెలంగాణలో చేరారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి అంజిరెడ్డి, నాయకులు వెంకట్‌రెడ్డి, పీఎల్‌ఎన్ చారి, మోహన్‌రెడ్డి, టి.శ్రీధర్, గోపాల్‌రెడ్డి, రమే్‌షరెడ్డి, జనార్ధన్‌రెడ్డి, ఆశారాజీ, పుష్పలత, భూపాల్‌రెడ్డి, విలియమ్, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.