పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-12-16T23:47:34+05:30 IST

పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాష్‌, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అన్నారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
షాబాద్‌: నియమకపత్రం అందజేస్తున్న ప్రకాష్‌

షాబాద్‌, డిసెంబరు 16: పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాష్‌, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని బీజేపీ షాబాద్‌ మండల కార్యాలయంలో శుక్రవారం ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యులుగా షాబాద్‌ మండలానికి చెందిన బర్క శ్రీశైలం, గుడికాడి గోపాల్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు జంగారెడ్డి, ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్‌ వెంకటే్‌షగౌడ్‌, మండల అధ్యక్షుడు కిరణ్‌, నాయకులు మాణేయ్య, గోవర్ధన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:47:35+05:30 IST