పీఆర్సీ అమలుకు కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-11-23T23:47:00+05:30 IST

పెంచిన పీఆర్సీని అమలు చేసేందుకు కృషి చేయాలని తాండూరు మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని కోరారు. ఈమేరకు బుధవారం తాండూరులో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు.

పీఆర్సీ అమలుకు కృషి చేయాలి
రోహిత్‌రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న కార్మికులు

తాండూరు, నవంబరు, 23 : పెంచిన పీఆర్సీని అమలు చేసేందుకు కృషి చేయాలని తాండూరు మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని కోరారు. ఈమేరకు బుధవారం తాండూరులో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోని అన్ని చోట్లా పెంచిన వేతనాలను ఇస్తున్నారని, తాండూరులో మాత్రం ఇవ్వడం లేదని వాపోయారు. కార్మికుల పీఆర్సీ అంశం ఎజెండా కోర్టు పరిధిలో ఉన్నందున పెంచిన వేతనాలు చెల్లించడం లేదని కార్మికులు ఎమ్మెల్యేకు మొర పెట్టుకున్నారు. కాగా, డిసెంబరులో సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే కార్మికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T23:47:00+05:30 IST

Read more