విలీన గ్రామాల అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2022-03-17T05:09:40+05:30 IST

విలీన గ్రామాల అభివృద్ధికి కృషి

విలీన గ్రామాల అభివృద్ధికి కృషి
మద్గుల్‌ చిట్టెంపల్లిలో కాంపౌండ్‌ వాల్‌ పనులను ప్రారంభించిన మంజులా రమేష్‌

వికారాబాద్‌, మార్చి 16 : మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులా రమేష్‌ పేర్కొన్నారు. బుధవారం మున్సిపల్‌ అభివృద్ధిలో భాగంగా 7, 8వ వార్డుల్లో పలు అభివృద్ధి పనులు, మద్గుల్‌ చిట్టెంపల్లిలో రూ.8లక్షల నిధులతో నిర్మించనున్న శ్మశానవాటిక కాంపౌండ్‌వాల్‌ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం రూ.2.5లక్షల నిధులతో నిర్మించనున్న డంపింగ్‌యార్డు కాంపౌండ్‌వాల్‌ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వికారాబాద్‌ మున్సిపల్‌లో విలీనమైన అన్ని గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక చొరవ తీసుకొని, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌ సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కౌన్సిలర్లు గోపాల్‌, సంతోష నర్సింలు, మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ రమే్‌షకుమార్‌, నాయకులు నర్సింలు, డీఈ రామ్‌కిషన్‌, ఏఈ రాయుడు, మున్సిపల్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Read more