పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి

ABN , First Publish Date - 2022-11-16T23:51:01+05:30 IST

అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నారు.

పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి
దెబ్బడగూడ గ్రామస్థులతో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి

కందుకూరు, నవంబరు 16: అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నారు. మండలంలోని దెబ్బడగూడ గ్రామంలో బుధవారం టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశమై మాట్లాడారు. ప్రతి గ్రామపంచాయతీల్లో 100మంది ఓటర్లకు ఇద్దరు టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులను ఇన్‌చార్జిగా నియమించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మార్కెట్‌ కమిటీ మాజీ డైరక్టరు జిట్ట రాజేందర్‌రెడ్డి, నాయకులు కె.విఘ్నేశ్వర్‌రెడ్డి, డి.జంగయ్య, రాములునాయక్‌, చక్రపాణి, లక్ష్మయ్య, నరిసింహ, విక్రంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-16T23:51:01+05:30 IST

Read more