విద్యావ్యవస్థను బలోపేతం చేయాలి

ABN , First Publish Date - 2022-09-14T05:23:27+05:30 IST

విద్యావ్యవస్థను బలోపేతం చేయాలి

విద్యావ్యవస్థను బలోపేతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో రేణుకాదేవి

వికారాబాద్‌, సెప్టెంబరు 13 : విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని, మండల స్థాయిలో స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలతో సమావేశాల నిర్వహణ, ఎఫ్‌ఎల్‌ఎన్‌ మానిటరింగ్‌, స్పాట్‌ అసెస్మెంట్‌ ఉపయోగించే విధానంలో శిక్షణా కార్యక్రమాలు గురువారం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రేణుకాదేవి తెలిపారు.  మంగళవారం డైట్‌ కళాశాలలో ఎంఈవో, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ మండల స్థాయిలో ఏఈవోలు, నోడల్‌ ఆఫీసర్లు, ఆర్పీలకు, సీఆర్పీలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లా అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారి రవి మాట్లాడుతూ మండలంలోని పాఠశాలల్లో విధిగా మానిటరింగ్‌ నిర్వహించి ఎఫ్‌ఎల్‌ఎన్‌లో భాగంగా విద్యార్థుల ప్రగతి ఎప్పకటికప్పుడు నమోదు చేయాలన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులకు ప్రోత్సాహం అందించి వారికి తగు సూచనలు, సలహాలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఫైౖనాన్స్‌ అధికారి అనంత్‌రెడ్డి, జిల్లా సెక్టోరియల్‌ అధికారి రవి, రాష్ట్ర రిసోర్స్‌పర్సన్‌ వీరేశం, నాగరాజు, విజయభాస్కర్‌రెడ్డి, రవి, ఆరిఫ్‌, అల్లావుద్దీన్‌, ఖాజాపాషా, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-14T05:23:27+05:30 IST