వైభవంగా దసరా ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-10-07T05:51:07+05:30 IST

వైభవంగా దసరా ఉత్సవాలు

వైభవంగా దసరా ఉత్సవాలు
ఆమనగల్లులో రావణాసురుడిని దహనం చేస్తున్న భక్తులు

ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌: రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా బుధవారం దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. రావణాసురుని వధను నిర్వహించి పండుగ చేసుకున్నారు. పండుగ సందర్భంగా గ్రామాలకు బంధుమిత్రులు తరలి రావడంతో గ్రామాలన్నీ కళకళలాడాయి. భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ జమ్మిచెట్టు వద్దకు వెళ్లి అక్కడ పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి ఆకు (బంగారం)ను ఒకరికొకరు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. భక్తులంతా పాలపిట్టను దర్శించుకున్నారు. 

Read more