ప్రతీ శుక్రవారం డ్రైడే పాటించాలి

ABN , First Publish Date - 2022-07-29T05:30:00+05:30 IST

ప్రతీ శుక్రవారం డ్రైడే పాటించాలి

ప్రతీ శుక్రవారం డ్రైడే పాటించాలి
చెత్త డబ్బాలో నిల్వ ఉన్న నీటిని పారబోస్తున్న కమిషనర్‌ యూసుఫ్‌

ఇబ్రహీంపట్నం, జూలై 29: ప్రతి శుక్రవారం డ్రైడే పాటించి కార్యాలయాలు, ఇంటి పరిసరాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ ఎండీ.యూసుఫ్‌ అన్నారు. శుక్రవారం ఆయన సిబ్బందితో కలిసి మున్సిపల్‌ కార్యాలయంలో పూల కుండీలు, బయట సామగ్రి నిల్వచేసిన చోట నిలిచిన వర్షపునీటిని తొలగించారు. నీరు నిల్వ ఉంటే క్రిమికీటకాలు వృద్ధిచెంది అనారోగ్యానికి దారి తీస్తాయని తెలిపారు. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో 4, 21వ వార్డుల్లో కొవిడ్‌ బూస్టర్‌ డోస్‌ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రోజుకు 250 మందికి వార్డుల వారీగా వైద్య సిబ్బంది బూస్టర్‌ డోస్‌ ఇవ్వడానికి ముందుకువచ్చారని తెలిపారు.  

Updated Date - 2022-07-29T05:30:00+05:30 IST