మృతుల కుటుంబాలకు డ్రైవర్స్ చేయూత
ABN , First Publish Date - 2022-10-07T06:14:25+05:30 IST
మృతుల కుటుంబాలకు డ్రైవర్స్ చేయూత
తలకొండపల్లి, అక్టోబర్ 6: వెల్జాలకు చెందిన తుపాకుల కృష్ణయ్య, బూరమోని తిరుపతయ్య ఇటీవల మృతి చెందారు. మృతుల కుటుంబాలను గురువారం వెల్జాల డ్రైవర్స్ యూనియన్ సభ్యులు పరామర్శించారు. డ్రైవర్స్ యూనియన్ తరఫున మృతుల కుటుంబాలకు ఒకొక్కరికి రూ.50వేల చొప్పున, గాయపడి చికిత్స పొందుతున్న రవికి రూ.10వేలు అర్థిక సాయం అందజేశారు.