తాగునీటి సమస్యను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-12-31T00:08:02+05:30 IST

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో తాగడానికి మంచినీటి సౌకర్యం కూడా లేదని, నీటి కనెక్షన్‌ లేక మరుగుదొడ్లు వృథాగా ఉన్నాయని, ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు పీడీఎ్‌సయూ నాయకులతో కలిసి తాండూరు పట్టణంలోని ఇందిరాచౌక్‌ వద్ద శుక్రవారం నిరసన తెలిపారు.

తాగునీటి సమస్యను పరిష్కరించాలి
విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటున్న సునీతా సంపత్‌, పీడీఎస్‌యూ నాయకులు

తాండూరు, డిసెంబరు 30 : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో తాగడానికి మంచినీటి సౌకర్యం కూడా లేదని, నీటి కనెక్షన్‌ లేక మరుగుదొడ్లు వృథాగా ఉన్నాయని, ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు పీడీఎ్‌సయూ నాయకులతో కలిసి తాండూరు పట్టణంలోని ఇందిరాచౌక్‌ వద్ద శుక్రవారం నిరసన తెలిపారు. కాలేజీ ఆవరణలోనే మిషన్‌ భగీరథ ట్యాంకులు నిర్మించినా.. కుళాయి కనెక్షన్లు ఇవ్వలేదని అన్నారు. ఈసందర్భంగా పీడీఎ్‌సయూ జిల్లా ఉపాధ్యక్షుడు దీపక్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా పాఠశాల సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈమేరకు మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ సునీతా సంపత్‌ విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ధర్నా వద్దకు మున్సిపల్‌ మేనేజర్‌ నరేందర్‌రెడ్డిని, మున్సిపల్‌, భగీరథ అధికారులను ఫోన్‌ చేసి పిలిపించారు. సోమవారంలోగా విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు. సమస్యను పరిష్కరించకుంటే పీడీఎ్‌సయూ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని దీపక్‌రెడ్డి అన్నారు.

Updated Date - 2022-12-31T00:08:03+05:30 IST