ఈ డీలర్‌ మాకొద్దు..

ABN , First Publish Date - 2022-09-14T05:13:11+05:30 IST

సరుకులను సక్రమంగా సరఫరా చేయని

ఈ డీలర్‌ మాకొద్దు..
గ్రామస్తులతో మాట్లాడుతున్న సర్పంచ్‌, ఆర్‌ఐ

  • రేషన్‌ షాపు వద్ద జైత్వారం గ్రామస్తుల ఆందోళన


కందుకూరు, సెప్టెంబరు 13 : సరుకులను సక్రమంగా సరఫరా చేయని డీలర్‌ మాకొద్దంటూ మండలంలోని జైత్వారం గ్రామస్తులు మంగళవారం రేషన్‌షాపు వద్ద ఆందోళన చేపట్టారు. గ్రామానికి చెందిన విజయ డీలర్‌ కాగా, ఆమె భర్త ప్రభాకర్‌ రేషన్‌షాపును నిర్వహిస్తున్నాడు. సరుకుల కోసం వచ్చినవారిని అతను బెదిరింపులకు పాల్పడుతూ సరుకులు తక్కువగా ఇస్తున్నట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. 6నెలలుగా ప్రభుత్వం ఇస్తున్న ఉచితబియ్యాన్ని తగ్గించి ఇస్తున్నాడని ఆరోపించారు. గ్రామ సర్పంచ్‌ ఎర్రబైరు సదాలక్ష్మీపుల్లారెడ్డి అక్కడికి చేరుకొని విషయాన్ని తహసీల్దార్‌ మంచిరెడ్డి మహేందర్‌రెడ్డికి వివరించారు. దీంతో ఆర్‌ఐ శ్రీనివాస్‌ రేషన్‌షాపు వద్దకు చేరుకొని డీలర్‌పై గ్రామస్తులు రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించారు. నివేదికను తహసీల్దార్‌కు అందిస్తానని ఆర్‌ఐ తెలిపారు.Read more