ఆలయ నిర్మాణానికి రూ. లక్ష విరాళం
ABN , First Publish Date - 2022-08-04T05:57:59+05:30 IST
ఆలయ నిర్మాణానికి రూ. లక్ష విరాళం
షాద్‌నగర్ అర్బన్, ఆగస్టు 3: ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్దలో పునర్నిర్మాణం చేస్తున్న ఆంజనేయస్వామి ఆలయానికి షాద్‌నగర్ బీజేపీ నాయకుడు అందె బాబయ్య లక్షా 16 రూపాయల విరాళం ఇచ్చారు. బుధవారం ఆలయ నిర్మాణ కమిటీ సభ్యుడు ఆన్మారి వెంకటయ్యకు ఈ మేరకు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు వెంకటే్‌షగుప్తా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.