రోడ్డుపై కల్లాలు ఏర్పాటు చేయొద్దు : ఎస్సై

ABN , First Publish Date - 2022-12-15T23:53:58+05:30 IST

రోడ్డుపై కల్లాలు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్సై గిరి తెలిపారు. గురువారం మండల పరిధిలోని కామునిపల్లి గ్రామ సమీపాన రోడ్డుపై ఏర్పాటుచేసిన వరి కల్లాలను ఆయన దగ్గరుండి తొలగించారు.

రోడ్డుపై కల్లాలు ఏర్పాటు చేయొద్దు : ఎస్సై

కులకచర్ల, డిసెంబరు 15: రోడ్డుపై కల్లాలు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్సై గిరి తెలిపారు. గురువారం మండల పరిధిలోని కామునిపల్లి గ్రామ సమీపాన రోడ్డుపై ఏర్పాటుచేసిన వరి కల్లాలను ఆయన దగ్గరుండి తొలగించారు. రోడ్లపై కల్లాల ఏర్పాటు, ధాన్యం ఆరబోత, నూర్పిళ్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో తగిన చర్యల నిమిత్తం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. మండల పరిధిలోని రైతులు ఎక్కడైనా రోడ్లపై వరి కల్లాలు ఏర్పాటుచేస్తే వెంటనే తొలగించాలన్నారు. సమాచారం ఇచ్చినప్పటికీ ఎవరైనా కల్లాలు ఏర్పాటు చేసినట్లు తమ దృష్టికి వస్తే సంబంధిత రైతులపై చర్యలు తీసుకుంటామని ఈసందర్భంగా ఎస్సై హెచ్చరించారు.

Updated Date - 2022-12-15T23:53:59+05:30 IST