మొబైల్ లింకులను ఓపెన్ చెయ్యొద్దు
ABN , First Publish Date - 2022-12-31T00:05:05+05:30 IST
ఎక్కడి నుంచే ఫోన్లకు వచ్చే మొబైల్ లిం కులను టచ్‌చేసి ఓపెన్ చెయ్యొద్దని, పిల్లలు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తామని ఎస్సై అనిత అన్నారు.
శామీర్‌పేట, డిసెంబరు 30: ఎక్కడి నుంచే ఫోన్లకు వచ్చే మొబైల్ లిం కులను టచ్‌చేసి ఓపెన్ చెయ్యొద్దని, పిల్లలు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తామని ఎస్సై అనిత అన్నారు. అలాంటి వారితో అప్రమత్తంగా ఉంటూ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. శుక్రవారం శామీర్‌పేటలోని జగద్గిరిగుట్ట గురుకుల మహి ళా డిగ్రీ కళాశాలో ప్రిన్సిపల్ ఇష్రత్ ఆధ్వర్యంలో సైబర్‌నేరాలపై షీ టీమ్స్ ఎస్సై అనిత అవగాహన కల్పించారు. విద్యార్థినులపై ఎవరైనా వేధింపులకు పాల్పడినా, అసభ్యకరంగా ప్రవర్తించినా పోలీసులకు ఫిర్యాదు చేయాల న్నారు. సైబర్‌నేరాలు, ఈవ్‌టీజింగ్‌పై అవగాహన కల్పించారు.