మద్యం తాగి వాహనాలు నడపొద్దు

ABN , First Publish Date - 2022-12-15T23:56:49+05:30 IST

వాహనదారులు మద్యం తాగి వాహనాలను నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై రవిగౌడ్‌ హెచ్చరించారు.

మద్యం తాగి వాహనాలు నడపొద్దు

కొడంగల్‌, డిసెంబరు 15: వాహనదారులు మద్యం తాగి వాహనాలను నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై రవిగౌడ్‌ హెచ్చరించారు. గురువారం కొడంగల్‌ పట్టణ శివారులోని చిట్లపల్లి గేటు వద్ద సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్‌సీ, ఇన్సూరెన్స్‌ లేని వాహనాలకు జరిమానాలతో పాటు చర్యలు తప్పవన్నారు. ప్రతీ వాహనదారుడు ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలని సూచించారు.

Updated Date - 2022-12-15T23:56:50+05:30 IST