జోరుగా బతుకమ్మ చీరల పంపిణీ

ABN , First Publish Date - 2022-09-25T05:56:09+05:30 IST

జోరుగా బతుకమ్మ చీరల పంపిణీ

జోరుగా బతుకమ్మ చీరల పంపిణీ
వికారాబాద్‌ : బీటీఎస్‌ కాలనీలో చీరలు పంపిణీ చేస్తున్న కౌన్సిలర్‌ సుధాకర్‌రెడ్డి

ఘట్‌కేసర్‌/ఘట్‌కేసర్‌ రూరల్‌/వికారాబాద్‌/కొడంగల్‌, సెప్గెంబరు 24 : బతుకమ్మ నేపథ్యంలో పేద, మధ్య తరగతి మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని పోచారం మున్సిపల్‌ చైర్మన్‌ కొండల్‌రెడ్డి అన్నారు. శనివారం పోచారం మున్సిపాలిటీ ఇస్మాయిల్‌ఖాన్‌గూడలో మహిళలకు టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఇస్మాయిల్‌ ఖాన్‌గూడలో రూ.2.5కోట్లతో నిర్మిస్తున్న 20లక్షల లీటర్ల వాటర్‌ ట్యాంకు నిర్మాణ పనులను పరిశీలించారు. టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాలేష్‌, నల్లవెల్లి శేఖర్‌, బద్దం జగన్‌మోహన్‌రెడ్డి, కాశయ్య, ఐలయ్య, బుచ్చిరెడ్డి, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఘట్‌కేసర్‌ మండలం ఘణాపూర్‌ గ్రామపంచాయతీలో సర్పంచ్‌ బద్దం గోపాల్‌రెడ్డి మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. వార్డుసభ్యులు పరమేష్‌గౌడ్‌, భాస్కర్‌, శోభ, మాజీ ఉపసర్పంచ్‌ సత్తయ్యగౌడ్‌, కో-ఆప్షన్‌ సభ్యురాలు లత, నాయకులు శంకర్‌గౌడ్‌, రాజుగౌడ్‌ పాల్గొన్నారు. 

అదేవిధంగా ఎదులాబాద్‌ గ్రామపంచాయతీ ఆవరణలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. సర్పంచ్‌ సురేష్‌, ఎంపీటీసీ రవి, వార్డుసభ్యులు ఆంజనేయులు, నందకుమార్‌, గణేష్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు ఇక్బాల్‌, నాయకులు జవ్వాజీ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కులమతాలకతీతంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని యాలాల మండలం అగ్గనూరు సర్పంచ్‌ భీమప్ప పేర్కొన్నారు. గ్రామపంచాయతీలో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఉపసర్పంచ్‌ వెంకటయ్య, ఎంపీటీసీ గరివప్ప, పంచాయతీ కార్యదర్శి రమాదేవి, నాయుకలు వీరప్ప తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రభుత్వం నాణ్యమైన, మేలు రకమైన చీరలు పంపిణీ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ వికారాబాద్‌ పట్టణాధ్యక్షుడు, కౌన్సిలర్‌ అర్ధ సుధాకర్‌రెడ్డి అన్నారు. మునిసిపల్‌ పరిధిలోని బీటీఎస్‌ కాలనీలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం  మునిసిపల్‌ సిబ్బంది చేస్తున్న పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. 

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందించే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని వికారాబాద్‌ మునిసిపల్‌ పరిధిలోని వాడవాడలా నిర్వహించారు. బూర్గుపల్లి, శివరాంనగర్‌ కాలనీ, సుభాష్‌ నగర్‌ కాలనీలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల రమేష్‌, వైస్‌చైర్మన్‌ శంషాబాద్‌బేగం, కౌన్సిలర్‌ గాయత్రి చీరలు పంపిణీ చేశారు. మిగితా కాలనీల్లో సైతం మహిళలకు కౌన్సిలర్లు చీరలను పంపిణీ చేశారు. కాగా, సోమవారం నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు కొడంగల్‌ తహసీల్దార్‌ బుచ్చయ్య తెలిపారు. శనివారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో మండలంలోని రేషన్‌ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలిపారు.


Read more