అంకిరెడ్డిపల్లి పంచాయతీ కార్యదర్శి తొలగింపు

ABN , First Publish Date - 2022-08-31T06:02:47+05:30 IST

అంకిరెడ్డిపల్లి పంచాయతీ కార్యదర్శి తొలగింపు

అంకిరెడ్డిపల్లి పంచాయతీ కార్యదర్శి తొలగింపు

కీసర, ఆగస్టు 30 : విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన పంచాయతీ కార్యదర్శిని ఉన్నతాధికారులు బాధ్యతల నుంచి తొలగించారు. మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో బి.శివకుమార్‌ ఔట్‌సోర్సింగ్‌ ద్వారా పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా అంకిరెడ్డిపల్లిలో అక్రమ నిర్మాణాల నిలుపుదలలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, విధులు పట్ల నిర్లక్ష్యం వహించడంతో మేడ్చల్‌ డీపీఆర్వో రమణమూర్తి పలుమార్లు హెచ్చరించినా మార్పు రాకపోవడంతో మంగళవారం విధుల నుంచి తొలగించాలని ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేశారు.

Read more