21న ప్రజా సమస్యలపై ధర్నా
ABN , First Publish Date - 2022-12-16T23:42:09+05:30 IST
ప్రజాసమస్యల పరిష్కారానికి 21న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలమల్లేశ్ అన్నారు.
పరిగి, డిసెంబరు 16: ప్రజాసమస్యల పరిష్కారానికి 21న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలమల్లేశ్ అన్నారు. శుక్రవారం పరిగిలో సన్నహక సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నేరవేర్చలేదన్నారు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ, డబల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు భూపంపిణీ పథకాలను మూలకు వేశారన్నారు. వీటి సాధన కోసం 21న చేపట్టే ధర్నాలను విజయవంతం చేయాలని కోరారు. సీపీఐ నాయకులు విజయలక్ష్మి, గోపాల్‌రెడ్డి, పీర్‌మహ్మద్, వెంకటేశ్, జంగయ్య, బాలు, చందు, రవి పాల్గొన్నారు.