‘ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలి’

ABN , First Publish Date - 2022-03-06T05:12:29+05:30 IST

‘ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలి’

‘ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలి’

బొంరా్‌సపేట్‌, మార్చి 5 : ధరణి పోర్టల్‌ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య, రైతు సంఘం నాయకులు ప్రభాకర్‌యాదవ్‌, మల్లేశ్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం బొంరా్‌సపేట్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 21న సీఐటీయూ, కేవీపీఎస్‌, వ్యవసాయ కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామన్నారు. రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం, అధికారులు విఫలం చెందినట్లు ఆరోపించారు. రైతుల పక్షాన శాప ంగా మారిన ధరణి పోర్టల్‌ను రద్దు చే సేంతవర కు దశలవారీ గా పోరాటా లు కొనసాగిస్తామన్నారు.


Read more