అక్రమ నిర్మాణాల కూల్చివేత

ABN , First Publish Date - 2022-03-06T05:14:46+05:30 IST

అక్రమ నిర్మాణాల కూల్చివేత

అక్రమ నిర్మాణాల కూల్చివేత
ఘణాపూర్‌లో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్న రెవెన్యూ అధికారి

ఘట్‌కేసర్‌ రూరల్‌, మార్చి 5: ప్రభుత్వ భూముల్లో ఆక్రమనిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తప్పవని తహసీల్దార్‌ విజయలక్ష్మి హెచ్చరించారు. ఘణాపూర్‌ పంచాయతీ, ఇందిరానగర్‌లోని ప్రభుత్వ భూమి సర్వేనెంబర్‌ 1107లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ అలేఖ్య శనివారం సిబ్బందితో వెళ్లి ఎక్స్‌కవేటర్‌తో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ భూముల జోలికొస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కాచవానిసింగారంలోని సర్వేనెంబర్‌ 66లోని ప్రభుత్వ భూమిలో పహారా ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు.

Read more