దీన్‌దయాళ్‌ సేవలు చిరస్మరణీయం

ABN , First Publish Date - 2022-09-26T05:36:04+05:30 IST

దీన్‌దయాళ్‌ సేవలు చిరస్మరణీయం

దీన్‌దయాళ్‌ సేవలు చిరస్మరణీయం
ఇబ్రహీంపట్నం: పోచారంలో పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న బీజేపీ నాయకులు

ఇబ్రహీంపట్నం/మంచాల/ఆదిభట్ల/యాచారం/షాద్‌నగర్‌ అర్బన్‌/కేశంపేట/మాడ్గుల/చేవెళ్ల, సెప్టెంబరు 25: ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి పటిష్టమైన పునాదులు వేసిన పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ సేవలు చిరస్మరణీయమని బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి పోరెడ్డి అర్జున్‌రెడ్డి అన్నారు. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆదివారం ఇబ్రహీంపట్నం మండలం పోచారం, పోల్కంపల్లి, ఉప్పరిగూడ, చెర్లపటేల్‌గూడ, కప్పాడు దండుమైలారం, రాయపోల్‌, ముకునూరు గ్రామాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు దండె శ్రీశైలం యాదవ్‌, మొగిలి గణేష్‌, దొండ విష్ణువర్దన్‌రెడ్డి, రమణారెడ్డి, మల్లేష్‌, శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మంచాలలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు జి.లచ్చిరెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పాండాల జంగయ్య, నూకంరాజు, గడ్డం రాజేందర్‌రెడ్డి, ఎస్‌.వెంకట్‌రెడ్డి, వెంకటేష్‌, మహేష్‌ పాల్గొన్నారు. అదేవిధంగా ఆదిభట్ల మున్సిపాలిటీ బొంగులూరు క్రాస్‌రోడ్డు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో దీన్‌దయాళ్‌ చిత్రపటానికి పూలమాలలువేసి జయంతి వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ బీజేపీ అధ్యక్షుడు శిగవీరస్వామిగౌడ్‌, ఆదిభట్ల మున్సిపాలిటీ బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ పొట్టి రాములు, జిల్లా గీతా సెల్‌ కన్వీనర్‌ పండాల లక్ష్మిపతిగౌడ్‌, మీడియా కన్వీనర్‌ అశోక్‌గౌడ్‌, నాయకులు హరిశంకర్‌గౌడ్‌ పాల్గొన్నారు. యాచారంలో బీజేపీ  మండల అధ్యక్షుడు తాండ్ర రవి ఆధ్వర్యంలో దీన్‌దయాళ్‌ చిత్రపటానికి బీజేపీ కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్‌.విజయ్‌కుమార్‌, బాషయ్య, మండల నాయకులు  కె.పురుషోత్తమ్‌, డి.ఈశ్వర్‌, సంతో్‌షగుప్త, సోమేష్‌, రమేష్‌ పాల్గొన్నారు. అదేవిధంగా షాద్‌నగర్‌ మున్సిపాలిటీలోని శంకర్‌నగర్‌ కాలనీ పార్కులో  బీజేపీ నాయకులు మొక్కలు నాటి నీరుపోశారు. నాయకులు నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి, పాలమూరు విష్ణువర్దన్‌రెడ్డి, అందె బాబయ్య పాల్గొన్నారు. కేశంపేటలోని పార్టీ కార్యాలయ ఆవరణలో దీనదయాల్‌ చిత్రపటాన్ని ఏర్పాటుచేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నరసింహయాదవ్‌, బీజేవైఎం అధ్యక్షుడు బైకని శేఖర్‌, ఉడుత హరికృష్ణ, పాలది శ్రీనివాస్‌, రాఘవేందర్‌, చంద్రయ్య, మహేష్‌, శివ పాల్గొన్నారు. అదేవిధంగా మాడ్గులలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ మండల అధ్యక్షుడు పెద్దయ్యయాదవ్‌ ఆధ్వర్యంలో దీన్‌దయాళ్‌ జయంతిని నిర్వహించారు. నాయకులు కాస పర్వతాలు, కాటయ్య, జగన్‌, మధు, కృష్ణ పాల్గొన్నారు. అదేవిధంగా బీజేపీ చేవెళ్ల మండల ప్రధాన కార్యదర్శి అనంత్‌రెడ్డి దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు. పార్టీ నాయకులు శర్వలింగం, మల్లారెడ్డి, శ్రీనివాస్‌, మధుకర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, కృష్ణమోహన్‌, శ్రీనివా్‌సరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, నితీ్‌షరెడ్డి, అశోక్‌, రాజేశ్వర్‌రెడ్డి, పాండు పాల్గొన్నారు.

Read more