ఘనంగా విజయదశమి

ABN , First Publish Date - 2022-10-07T05:43:23+05:30 IST

ఘనంగా విజయదశమి

ఘనంగా విజయదశమి
ఆలంపల్లిలో షమీ పూజలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ఆనంద్‌, తెలంగాణ బీసీ కమిషన్‌ సభ్యుడు శుభప్రద్‌ పటేల్‌

  • ఆలయాల వద్ద షమీ పూజలు.. ఆలింగనాలు 
  • మైదానాల్లో రావణ దహనం

వికారాబాద్‌/మేడ్చల్‌, అక్టోబరు6(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో దసరా పండుగ ను బుధవారం ప్రజలు ఘనంగా జరపుకున్నారు. విందు భోజనాల అనంతరం కొత్త దుస్తులు ధరించి పా లపిట్టను చూసేందుకు పొలాలు, అటవీ ప్రాంతాలకు వెళ్లారు. సాయంత్రం ఆలయాలకు చేరుకొని షమీ పూజ నిర్వహించిన అనంతరం బంగారం ఇచ్చిపుచ్చు కుంటూ ఒకరినొకరు ఆలింగనాలు చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వేడుకల్లో ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొని ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే దుర్గామాతల విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు.

Read more