దెబ్బతిన్న చెరువు కుంటల మరమ్మతులు చేయాలి

ABN , First Publish Date - 2022-10-12T05:30:00+05:30 IST

దెబ్బతిన్న చెరువు కుంటల మరమ్మతులు చేయాలి

దెబ్బతిన్న చెరువు కుంటల మరమ్మతులు చేయాలి

  • బీజేపీ నాయకుడు తల్లోజు ఆచారి 

తలకొండపల్లి, అక్టోబరు 12: వర్షాలకు దెబ్బతిన్న చెరువులు, కుంటలను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని జాతీయ బీసీ కమీషన్‌ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి కోరారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని కోరారు. చీపునుంతల అమ్రాయి చెరువును బుధవారం ఆయన సందర్శించారు. అలుగు వద్ద కోతను పరిశీలించారు. కట్ట తెగే ఆస్కారం ఉందని, వెంటనే మరమతులు చేయాలని కోరారు. 

  • నీటి శుద్ధి కేంద్రం ప్రారంభం

శుద్ధ తాగునీరు సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుందని ఆచారి అన్నారు. దేవుని పడకల్‌లో కమ్యూనిటీ డెవల్‌పమెంట్‌ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నీటిశుద్ధి కేంద్రాన్ని సర్పంచ్‌ శ్రీశైలం, ఎంపీటీసీ రఘు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమాల్లో బీజేపీ మండల అధ్యక్షుడు రవిగౌడ్‌, చంద్రధన సర్పంచ్‌ బక్కికుమార్‌, బీజేవైఎం నాయకులు పాండు, పద్మ అనిల్‌, ప్లాంట్‌ నిర్వాహకుడు వెంకటేశ్‌,శ్రీనివా్‌సరెడ్డి, శ్రీశైలం, గణేశ్‌, శేఖర్‌రెడ్డి, రమేశ్‌, రాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-12T05:30:00+05:30 IST